: మహానాడులో ఎక్కడ కూర్చున్నా.. క్షణాల్లో బయటకు వెళ్లిపోవచ్చు
మహానాడు ప్రాంగణం టీడీపీ నేతలు, కార్యకర్తలతో కళకళలాడుతోంది. భారీ కటౌట్లు, ఎగ్జిబిషన్ తో కనువిందు చేస్తోంది. వేలాదిగా తరలి వచ్చిన పార్టీ శ్రేణులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా నిర్వాహకులు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. ఎండ వేడిమి నుంచి కార్యకర్తలకు ఉపశమనం కలిగించేందుకు ప్రాంగణానికి ఇరువైపులా 40 భారీ కూలర్లు ఏర్పాటు చేశారు. పెద్ద ఫ్యాన్లను ఏర్పాటు చేశారు. చిన్న చిన్న ఫ్యాన్లను కూడా అందుబాటులో ఉంచారు.
వేదికపై జరుగుతున్న ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా వీక్షించేందుకు 15 భారీ ఎల్ఈడీ స్క్రీన్లను నిర్వాహకులు ఏర్పాటు చేశారు. దీనికితోడు ఎలాంటి విద్యుత్ అంతరాయాలు ఏర్పడకుండా 21 జనరేటర్లను వినియోగిస్తున్నారు. ప్రాంగణం చుట్టుపక్కల 200 టాయిలెట్లను ఏర్పాటు చేశారు. ఎక్కడికక్కడే వాటర్ బాటిల్స్, వాటర్ పాకెట్స్ అందేలా ఏర్పాట్లు చేశారు. ఎక్కడ కూర్చున్న వ్యక్తి అయినా క్షణాల్లో బయటకు వెళ్లేలా పక్కా ప్రణాళికతో ఏర్పాట్లు చేశారు.