: 'భువనగిరి ప్రేమ కథ' విషాదాంతం!: నరేష్ ను హత్య చేశారు... చంపింది స్వాతి తండ్రే!


భువనగిరి జిల్లాకు చెందిన స్వాతి, నరేష్ ల ప్రేమకథ విషాదంగా ముగిసింది. నరేష్ ను స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డే హత్య చేశాడు. ఇతనికి అతని సోదరుడు, డ్రైవర్ సత్తిరెడ్డి సహకరించారు. వీరంతా కలసి నరేష్ ను నరికి చంపి, కాల్చి, వారి పొలంలోనే పూడ్చి పెట్టారు. ఈ నెల 16న స్వాతి ఆత్మహత్యకు పాల్పడిన సంగతి తెలిసిందే. కానీ, నరేష్ ఆచూకీ మాత్రం దొరకలేదు. నరేష్ ఏమయ్యాడో అనేది మిస్టరీగా మారింది. ఈ నేపథ్యంలో, ఈ మిస్టరీని పోలీసులు ఛేదించారు.

ప్రస్తుతం స్వాతి తండ్రి శ్రీనివాసరెడ్డి ఎల్బీనగర్ డీసీపీ స్పెషల్ టీమ్ అదుపులో ఉన్నాడు. పోలీసు విచారణలో నిందితులు తమ నేరాన్ని అంగీకరించారు. హత్యకు ముందు స్వాతితో నరేష్ కు ఫోన్ చేయించాడు ఆమె తండ్రి. వివాహం జరిపిస్తామంటూ నమ్మించాడు. శ్రీనివాసరెడ్డి మాటలను నమ్మి వచ్చిన నరేష్ ను హత్య చేసి, కాల్చి, పాతిపెట్టారు.

  • Loading...

More Telugu News