: అన్ని రికార్డులను ‘దువ్వాడ జగన్నాథం’ బద్దలు కొడుతుంది: నటి పూజా హెగ్డే


స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించిన ‘దువ్వాడ జగన్నాథం (డీజే)’ చిత్రం త్వరలో విడుదల కానుంది. అల్లు అర్జున్ సరసన పూజా హెగ్డే నటిస్తోంది. సామాజిక మాధ్యమం వేదికగా తన అభిమానులతో పూజా హెగ్డే సంభాషించింది. ‘డీజే’లో అల్లు అర్జున్ ఉత్తమ నటన ప్రదర్శించాడని, ఈ సినిమా కోసం బన్నీ చేసిన కృషి అంతాఇంతా కాదని చెప్పింది. ఈ చిత్రం అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని అభిప్రాయపడింది. అల్లు అర్జున్ తో కలిసి పని చేయాలని తానెప్పుడూ కోరుకుంటానని, టాలెంటెడ్ ఆర్టిస్ట్ అయిన బన్నీ నుంచి తానెన్నో విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. కాగా, తెలుగులో ‘ఒక లైలా కోసం’, ‘ముకుంద’ చిత్రాల్లో పూజా హెగ్డే నటించింది.

  • Loading...

More Telugu News