: శ్రీలంకలో ప్రకృతి బీభత్సం.. సహాయక చర్యల్లో భారత నౌకా దళం!
శ్రీలంకలో వరదలు బీభత్సం సృష్టిస్తున్నాయి. ఇప్పటి వరకు 91 మంది చనిపోగా, 110 మందికి పైగా వ్యక్తులు గల్లంతయ్యారు. దక్షిణ, ఉత్తర శ్రీలంక ప్రాంతాల్లో ఇప్పటివరకు సుమారు ఇరవై వేల మందికి పైగా ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీలంక మిలటరీ బోట్లు, హెలీ కాప్టర్లతో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. శ్రీలంక సహాయక చర్యల్లో భారత నౌకాదళానికి చెందిన రెండు నౌకలు పాల్గొననున్నాయి. వైద్య సిబ్బంది, మందులు, పునరావాస సామగ్రితో ఐఎన్ఎస్ కిర్చ్ కొలంబో చేరుకుంది. మరికొన్ని గంటల్లో రెండో నౌక ఐఎన్ఎస్ జలాశ్వ కొలంబో చేరుకోనుంది.