: ఈనెల 30న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు బంద్
ఈ నెల 30న దేశవ్యాప్తంగా మెడికల్ షాపులు మూతపడనున్నాయి. మందుల విక్రయాలపై ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించడం, మార్జిన్‌ను తగ్గించడాన్ని వ్యతిరేకిస్తూ ఆల్ ఇండియా ఆర్గనైజేషన్ ఆఫ్ కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్స్ (ఏఐవోసీడీ) 30న ఒక రోజు పాటు బంద్ నిర్వహించాలని నిర్ణయించింది. ఈ బంద్‌లో 9 లక్షల మంది పాల్గొననున్నట్టు ఏఐవోసీడీ ప్రతినిధులు తెలిపారు. నిబంధనల మార్పులపై ప్రభుత్వాన్ని కలిసి పలుమార్లు విన్నవించినప్పటికీ ఎటువంటి స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొన్నారు. బంద్‌కు సంబంధించి ప్రధానమంత్రి కార్యాలయం, ఆరోగ్య, హోం మంత్రిత్వ శాఖ, డ్రగ్ కంట్రోలర్‌కు నోటీసులు పంపినట్టు తెలిపారు.