: పంజాబ్ మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ కన్నుమూత

పంజాబ్ లో టెర్రరిజాన్ని ఉక్కుపాదంతో అణచివేసిన పోలీస్ బాస్ గా పేరుతెచ్చుకున్న ఆ రాష్ట్ర మాజీ డీజీపీ కేపీఎస్ గిల్ తుదిశ్వాస విడిచారు. అనారోగ్యంతో బాధపడుతున్న గిల్ ను మే 18న ఢిల్లీలోని గంగారామ్ ఆసుపత్రిలో చేర్పించారు. నెమ్మదిగా ఆయన కోలుకుంటున్న తరుణంలో... కార్డియాక్ అరెస్ట్ కు గురయ్యారు. దీంతో, ఆయన కన్నుమూశారు. ప్రస్తుతం ఆయన వయసు 82 సంవత్సరాలు. ఇండియన్ హాకీ ఫెడరేషన్ అధ్యక్షుడిగా కూడా ఆయన పనిచేశారు. అంతేకాదు కౌంటర్ టెర్రరిజం సలహాదారుగా కూడా ఆయన సేవలు అందించారు. ఆయన అందించిన సేవలకు గాను కేంద్ర ప్రభుత్వం 1989లో ఆయనను పద్మశ్రీ పురస్కారంతో సత్కరించింది.

More Telugu News