: భార్యలేని జీవితం తనకు వద్దంటూ ఆత్మ‌హ‌త్య చేసుకున్న భ‌ర్త

భార్యలేని జీవితం తనకు వద్దంటూ లేఖ రాసి ఓ గుర్తు తెలియ‌ని వ్య‌క్తి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఘ‌ట‌న మేడ్చ‌ల్ జిల్లా జవహర్‌నగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలోని చెన్నపురం చెరువు వ‌ద్ద చోటుచేసుకుంది. త‌న భార్య నాలుగేళ్ల క్రితం మృతి చెందింద‌ని, ఒంటరిగా జీవించలేకే తాను ఆత్మహత్య చేసుకుంటున్నానని ఆ వ్య‌క్తి సూసైడ్‌ నోట్‌లో రాశాడ‌ని పోలీసులు తెలిపారు. ఆ వ్యక్తి చెరువులోకి దూకి ఆత్మ‌హ‌త్య చేసుకోవడాన్ని గమనించిన స్థానికులు త‌మ‌కు స‌మాచారం అందించార‌ని అన్నారు. మృతుడిది వరంగల్‌ అని గుర్తించారు. ఆ మృతదేహాన్ని పోస్టుమార్గం నిమిత్తం ఆస్పత్రికి తరలించిన‌ట్లు చెప్పారు.        

More Telugu News