: కూతురితో తొలి ఫోటోషూట్ లో పాల్గొన్న గంగూలీ...సోషల్ మీడియాలో వైరల్


టీమిండియాను విజయాలబాట పట్టించిన దిగ్గజ కెప్టెన్ సౌరవ్ గంగూలీ తొలిసారి కుమార్తె సనతో కలిసి ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. ఒక ప్రీమియర్ జ్యుయలరీ కి సంబంధించిన యాడ్ లో నటించిన సందర్భంగా గంగూలీ కుమార్తె సనతో ఫోటో షూట్ లో పాల్గొన్నాడు. గతంలో పలు యాడ్స్ లో నటించిన గంగూలీకి కెమెరాను ఫేస్ చేయడం అలవాటే. అయితే, సన కూడా అనుభవం వున్నదానిలా కెమెరా ముందు నిలబడడం అందర్నీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఇన్నాళ్లూ భార్య, కుమార్తెలను మీడియాకు దూరంగా ఉంచిన గంగూలీ ఇలా తొలిసారిగా కుమార్తెతో ఫోటో షూట్ లో పాల్గొనడంతో ఆ ఫోటోలు వైరల్ అవుతున్నాయి.

  • Loading...

More Telugu News