: ఓపక్క నష్టపోతున్నా మీతోనే కలిసున్నాం... మీ వాళ్లను కట్టడి చేయండి: అమిత్ షాతో చంద్రబాబు
భారతీయ జనతా పార్టీతో పొత్తు వల్ల తమకు నష్టం కలుగుతున్నా, దేశ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకునే కలిసున్నామని ఏపీ సీఎం చంద్రబాబునాయుడు అమిత్ షాకు స్పష్టం చేశారు. బీజేపీ నాయకులు నిత్యమూ తెలుగుదేశం నేతలను విమర్శిస్తున్నారని, వారిని కట్టడి చేయాలని కోరారు. విమర్శల వల్ల ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళుతున్నాయని, ఈ విషయంలో కొందరు తెలుగుదేశం నేతలను సైతం తాను మందలించానని గుర్తు చేశారు. నేతల మధ్య సఖ్యత ఉంటేనే మరోసారి విజయం సాధించగలమని, రాష్ట్ర విభజనకు ముందు ఇచ్చిన హామీల్లో ఏది నెరవేరకున్నా అది విపక్షాలకు అస్త్రంగా మారుతుందని, ఆ పరిస్థితిని రానీయకుండా చూసుకుందామని అమిత్ షాతో చంద్రబాబు చెప్పినట్టు సమాచారం.