: రజనీకాంత్ 161వ సినిమా టైటిల్ వెల్లడి... లోగోను ఆవిష్కరించిన ధనుష్
సూపర్ స్టార్ రజనీకాంత్ 161వ సినిమా టైటిల్ ను ఆయన అల్లుడు, హీరో ధనుష్ కొద్ది సేపటి క్రితం ఆవిష్కరించారు. ఈ సినిమా 'కబాలీ'కి సీక్వెల్ గా రూపొందుతుండగా, దీనిని ధనుష్ నిర్మిస్తున్నారు. 'కబాలీ'కి దర్శకత్వం వహించిన పా. రంజిత్ దీనికి కూడా దర్శకుడు. ఈ చిత్రానికి 'కాలా అలియాస్ కరికాలన్' అన్న పేరును పెట్టినట్టు ధనుష్ వెల్లడించారు. ఈ మేరకు ఫస్ట్ లుక్ ను విడుదల చేసిన ఆయన, ఈ చిత్రం అభిమానులు మెచ్చేలా ఉంటుందని చెప్పారు. కాగా, ఈ చిత్రంతో రజనీ రాజకీయ రంగ ప్రవేశం ముడిపడి వుంటుందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. సమకాలీన రాజకీయ అంశాల ప్రస్తావనతో చిత్ర కథ తయారైనట్టు సమాచారం.