: కిక్కిరిసిన తిరుమల గిరులు... 4 రోజుల పాటు వీఐపీ దర్శనాలు రద్దు

వేసవి సెలవులు ముగింపు దశకు వస్తుండటంతో గత ఐదారు రోజులుగా రద్దీ ఎంతమాత్రమూ తగ్గకపోవడంతో వచ్చే నాలుగు రోజుల పాటు వీఐపీ దర్శనాలు రద్దు చేస్తున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం జేఈఓ వెల్లడించారు. విపరీతమైన రద్దీ కారణంగా, మరింత మంది సాధారణ భక్తులకు స్వామి వారి దర్శనం చేయించాలన్న ఉద్దేశంతోనే ఈ నిర్ణయం తీసుకున్నామని, ఈ వారంలో తొలి మూడు రోజులు కూడా వీఐపీ బ్రేక్ దర్శనాల టికెట్లను పరిమిత సంఖ్యలోనే జారీ చేశామని అన్నారు. రద్దీ మరిన్ని రోజుల పాటు కొనసాగే అవకాశాలు ఉండటంతో, స్వయంగా వచ్చిన ప్రొటోకాల్ వీఐపీలకు మినహా, మిగతా అన్ని రకాల సిఫార్సు లేఖలపై బ్రేక్ దర్శనాలు నిలిపివేసినట్టు తెలిపారు. భక్తులకు అన్న పానీయాల లోటు లేకుండా చూస్తున్నామని అన్నారు.

More Telugu News