: రజనీకి బీజేపీతోనే లాభం...సీఎం అయ్యే అవకాశం ఉంది: పొన్ రాధాకృష్ణన్‌


తమిళ సూపర్ స్టార్ రజనీకాంత్ రాజకీయ అరంగేట్రంపై చర్చ నడుస్తున్న వేళ కేంద్ర మంత్రి పొన్‌ రాధాకృష్ణన్‌ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కరూర్‌ లో ఆయన మీడియాతో మాట్లాడుతూ, రజనీకాంత్ రాజకీయాల్లోకి రావడం మంచిదేనని అన్నారు. బీజేపీలో చేరితే ఇంకా మంచిదని ఆయన స్వాగతం పలికారు. బీజేపీలో ఆయనకు సముచిత స్థానం ఉంటుందని స్పష్టం చేశారు. అలాగే ఆయన బీజేపీలో చేరితే ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఆయనను పార్టీ ప్రకటించే అవకాశం ఉందని తెలిపారు. బీజేపీలో చేరడం వల్ల ఆయనకే లాభమని ఆయన చెప్పారు.

కాగా, రజనీ రాజకీయ ప్రవేశంపై తమిళనాట పెద్ద చర్చ నడుస్తోంది. ఆయన కొత్త పార్టీ పెడతారా? లేక బీజేపీలో చేరుతారా? అన్నదానిపై జోరుగా విశ్లేషణలు జరుగుతున్నాయి. త్వరలో ఆయన ప్రధాని నరేంద్ర మోదీని కలవనున్నారని, ఆ తరువాత ఆయన తన రాజకీయ రంగ ప్రవేశంపై నిర్ణయం ప్రకటించే అవకాశం ఉందని తమిళనాట వార్తలు వెలువడుతున్నాయి. 

  • Loading...

More Telugu News