: రజనీ కాంత్ బీజేపీలోకి ఎప్పుడు వచ్చినా ఓకే: అమిత్ షా

సౌతిండియా సూప‌ర్ స్టార్ రజనీ కాంత్ రాజ‌కీయాల్లోకి వ‌స్తారంటూ మ‌రోసారి ఊహాగానాలు జోరందుకున్న వేళ ఆయ‌న‌ను త‌మ పార్టీలో చేర్చుకోవాల‌ని భావిస్తోన్న బీజేపీ ఇంకా ఆ ఆశ‌ల‌ను వదులుకోలేదు. బీజేపీ జాతీయాధ్య‌క్షుడు అమిత్ షా ఈ రోజు ర‌జ‌నీ విష‌యంపై మ‌రోసారి స్పందించారు. ఓ మీడియా ఛానెల్‌తో ఆయ‌న మాట్లాడుతూ... తమిళనాడులో త‌మ పార్టీ బలహీనంగా ఉందని, రజనీకాంత్ వస్తే బలపడుతుందని అన్నారు. ఆయ‌న కోసం తమ పార్టీ ఎల్ల‌ప్పుడూ త‌లుపులు తెరిచే ఉంటాయ‌ని వ్యాఖ్యానించారు. త‌మ పార్టీలో చేరే అంశంపై ర‌జ‌నీ స్వేచ్ఛ‌గా నిర్ణయం తీసుకోవాల‌ని అన్నారు. ఎన్డీఏ స‌ర్కారు సుపరిపాలన గురించి త్వ‌ర‌లోనే తాము తమిళనాడులో ప్రచారం చేస్తామని తెలిపారు.                              

More Telugu News