: టాలీవుడ్ హీరోలపై సంచలన వ్యాఖ్యలు చేసిన మ్యూజిక్ డైరెక్టర్ మణిశర్మ
తెలుగు సినీ హీరోలపై ప్రముఖ సంగీత దర్శకుడు మణిశర్మ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు. టాలీవుడ్ లో మంచి పాటలు రాకపోవడానికి హీరోలే కారణమని తేల్చి చెప్పాడు. ప్రస్తుత కాలంలో గుర్తుండిపోయే పాటలు రాకపోవడానికి కారణం హీరోలే అని చెప్పాడు. కొంతమంది హీరోలు తమ డ్యాన్స్ కు అనుగుణంగా పాటలు ఉండాలని కోరుకుంటారని... మరికొంత మంది మాస్ సాంగ్స్ కావాలని డిమాండ్ చేస్తారని చెప్పారు. హీరోలను దృష్టిలో పెట్టుకునే పాటలను కంపోజ్ చేయాల్సిన దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయని విమర్శించాడు. 'ఇలాంటి కారణాల వల్లే 'ఖలేజా', 'శక్తి', 'తీన్ మార్' సినిమాలకు మంచి పాటలు ఇవ్వలేకపోయానేమో' అని చెప్పాడు. ప్రస్తుతం 'అమీ తుమీ', 'ఫ్యాషన్ డిజైనర్' సినిమాలకు మణిశర్మ సంగీతం అందిస్తున్నాడు.