: తమిళనాట విడుదలకు సిద్ధమవుతున్న బాలయ్య సినిమా!
నందమూరి బాలకృష్ణ 100వ చిత్రం 'గౌతమీపుత్ర శాతకర్ణి' సినిమా త్వరలో తమిళ సినీఅభిమానుల ముందుకు వెళ్లబోతోంది. ఈ చిత్రాన్ని తమిళంలోకి డబ్ చేస్తున్నారు. 'బాహుబలి' సినిమా ఘన విజయం సాధించడంతో... తమిళనాట కూడా చారిత్రక నేపథ్యంలో వచ్చే సినిమాలకు క్రేజ్ పెరిగింది. దీంతో బాలయ్య సినిమాను తమిళంలో విడుదల చేసేందుకు సన్నాహకాలు చేస్తున్నారు. తమిళంలో కూడా ఈ సినిమా మంచి ఆదరణ పొందుతుందని నిర్మాతలు ధీమా వ్యక్తం చేస్తున్నారు.