: హైదరాబాదు పాతబస్తీలో బరాత్ లో తల్వార్ తో యువకుల హల్ చల్!
హైదరాబాదులోని పాతబస్తీలో వికృత క్రీడలు పెరిగిపోతున్నాయి. మొన్నటికి మొన్న పుట్టిన రోజు వేడుకల్లో తుపాకితో గాల్లోకి కాల్పులు జరిపి ఒక వ్యక్తి హల్ చల్ చేయగా, నేడు పాతబస్తీలోని తలాబ్ కట్ట ప్రాంతంలో జరిగిన వివాహ వేడుక బరాత్ (ఊరేగింపు) కార్యక్రమంలో ఒక యువకుడు తల్వార్లతో విన్యాసాలు చేశాడు. ఈ సందర్భంగా అతను తిప్పిన కత్తి ఒక వ్యక్తికి తగలడంతో తీవ్రంగా గాయపడగా, అతనిని ఆసుపత్రికి తరలించారు. మరో వ్యక్తికి కూడా గాయాలైనట్టు తెలుస్తోంది. దీంతో పోలీసులపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి ఆయుధ సంస్కృతి ప్రమాదకరమని హెచ్చరిస్తున్నారు.