: సినిమా నటులు సంయమనం పాటించాలి.. ఇది అందరికీ గుణపాఠం!: చలపతిరావు వెకిలి వ్యాఖ్యలపై నరేష్

అక్కినేని నాగచైతన్య కొత్త చిత్రం ‘రారండోయ్ వేడుక చూద్దాం’ ఆడియో విడుద‌ల సంద‌ర్భంగా సినీ న‌టుడు చ‌ల‌ప‌తిరావు అమ్మాయిల‌పై చేసిన వెకిలి వ్యాఖ్య‌లు క‌ల‌క‌లం రేపుతున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న‌పై ప‌లు మ‌హిళా సంఘాలు పోలీస్ స్టేష‌న్‌లో కూడా ఫిర్యాదు చేశాయి. మ‌రోవైపు ‘రారండోయ్ వేడుక చూద్దాం’ సినిమాకు కూడా ఈ అంశం త‌ల‌నొప్పిగా మారింది. దీనిపై స్పందించిన సీనియర్ నటుడు, మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ప్రతినిధి నరేష్ ఈ రోజు మ‌ధ్యాహ్నం మీడియా స‌మావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు. చలపతిరావు అమ్మాయిల‌ను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు, వాటిపై రేగిన దుమారం తామందరికీ ఓ గుణ‌పాఠ‌మ‌ని ఆయ‌న అన్నారు.

ఆడియో ఫంక్ష‌న్ లాంటి కార్యక్రమాలు చాలావరకు జోకులతోనే కొనసాగుతాయని చెప్పిన న‌రేష్‌... కొంతమంది నటులు హాస్యానికి, అవసరం లేని వ్యాఖ్యలకు మధ్య ఉండే చిన్న తేడాను గుర్తించ‌డం లేద‌ని అన్నారు. న‌టులు ఏదో ఉత్సాహంలో ఒక వ్యాఖ్య చేయ‌డం, ఆ మాట సామాజిక మాధ్య‌మాల ద్వారా వైర‌ల్ కావ‌డం వంటివి కొన్నేళ్లుగా జ‌రుగుతున్నాయ‌ని అన్నారు. కాబ‌ట్టి నటీనటులు సంయమనం పాటించడం అవసరమని వ్యాఖ్యానించారు. న‌టులు త‌మ‌ వ్యక్తిగత జీవితంలో ఎలా ఉన్నప్ప‌టికీ ఇటువంటి కార్య‌క్ర‌మాల్లో మాత్రం అటువంటి వ్యాఖ్య‌లు చేయ‌కుండా ఉండాల‌ని ఆయ‌న అన్నారు.                                 

More Telugu News