: యాంకర్ సుమ, ఝాన్సీలు చాలా సార్లు కంటతడి పెట్టుకున్నారు... బాలకృష్ణ, అలీలు దారుణంగా కామెంట్ చేశారు: మహిళా సంఘాలు
మహిళలపై ప్రముఖ నటుడు చలపతిరావు చేసిన వ్యాఖ్యలు అగ్గిని రాజేశాయి. ఆయన వ్యాఖ్యల పట్ల మహిళా సంఘాలు నిప్పులు చెరుగుతున్నాయి. ఆయనపై కేసును కూడా పెట్టాయి. ఈ సందర్భంగా మహిళా సంఘాల నాయకురాళ్లు మాట్లాడుతూ, సినీ రంగంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై మండిపడ్డారు. సినిమా ఫంక్షన్లలో వ్యాఖ్యాతలుగా వ్యవహరించే మహిళలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారని ఆరోపించారు. యాంకర్లు సుమ, ఝాన్సీలు కూడా అనేక సార్లు ఫంక్షన్ల వేదికలపై కంటతడి పెట్టుకున్నారని... పక్కకు వెళ్లి కన్నీళ్లు తుడుచుకుని వచ్చి ప్రోగ్రామ్ ను కంటిన్యూ చేశారని తెలిపారు. వారి ఆవేదనను తమతో కూడా చాలా సార్లు పంచుకున్నారని చెప్పారు.
హాస్య నటుడు అలీ లాంటి వాళ్లు స్టేజిపైనే చాలా ఇబ్బందికరంగా మాట్లాడతారని మండిపడ్డారు. యాంకర్లు, హీరోయిన్ల గురించి చాలా అసభ్యంగా కామెంట్ చేస్తారని ధ్వజమెత్తారు. హీరో బాలయ్య అయితే 'అయితే ముద్దు పెట్టుకోవాలి... లేకపోతే కడుపు చేయాలి' అని బహిరంగంగానే అంటారని విమర్శించారు. ఈ రోజు నాగచైత్య 'అమ్మాయిలు చాలా డేంజర్' అనే ట్యాగ్ లైన్ ఇస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు.