: ప్రో కబడ్డీ లీగ్ లో పాక్ కు మూసుకుపోయిన దారులు!
వచ్చే నెలలో జరిగే ప్రో కబడ్డీ లీగ్ పోటీల్లో పాకిస్థాన్ ఆటగాళ్లను ఆడనిచ్చే అవకాశమే లేదని కేంద్రం స్పష్టం చేసింది. పొరుగుదేశం ఉగ్రవాదానికి ఉతమిచ్చినన్ని రోజులూ వారిపై ఆంక్షలు ఉంటాయని తెలిపింది. పాక్ కు చెందిన కబడ్డీ ఆటగాళ్లు, ప్రో కబడ్డీ లీగ్ పోటీలపై గంపెడాశలు పెట్టుకున్న సంగతి తెలిసిందే. వివిధ టీములు పాక్ ఆటగాళ్లను కొనుగోలు చేయాలని కూడా ఆసక్తిని చూపాయి. దీంతో పాక్ ఆటగాళ్లను కూడా వేలంలో చేర్చాలని లీగ్ నిర్వాహకులు భావించారు. కానీ వారిని అనుమతించరాదని కేంద్రం నిర్ణయించింది. తమ దేశంలోని ఉగ్ర మూలాలను సమూలంగా నాశనం చేసేంత వరకూ పాక్ ఆటగాళ్లను ఆడనీయడం అసాధ్యమని క్రీడా శాఖ మంత్రి విజయ్ గోయల్ స్పష్టం చేశారు. కాగా, జూన్ 25న పుణెలో ప్రారంభమయ్యే ఈ పోటీల్లో పుణెరీ పల్తాన్స్ తో తెలుగు టైటాన్స్ తొలి మ్యాచ్ ఆడనున్న సంగతి తెలిసిందే.