: మాంచెస్టర్ నగరంలో దాడి మేమే చేశాం.. ఇది ఆరంభం మాత్రమే.. భీకర దాడులు ముందున్నాయి: ఐసిస్
ఇంగ్లండ్ లోని మాంచెస్టర్ లో నరమేధం సృష్టించింది తామేనని ఐసిస్ ప్రకటించింది. ఇది కేవలం ఆరంభం మాత్రమేనని... భీకరమైన దాడులు ముందున్నాయని హెచ్చరించింది. మాంచెస్టర్ లోని మాంచెస్టర్ ఎరీనా వద్ద శక్తిమంతమైన బాంబు పేలడంతో 20 మంది మృతి చెందిన సంగతి తెలిసిందే. ఈ ఘటనలో మరో 50 మంది గాయపడ్డారు.
మరోవైపు మాంచెస్టర్ పేలుళ్లు విజయవంతం కావడంతో ఐసిస్ మద్దతుదారులు సంబరాలు జరుపుకుంటున్నారు. మోసుల్ లో దాడులకు ప్రతీకారంగానే ఈ దాడులు చేశామంటూ ట్విట్టర్ లో కామెంట్ చేశారు. కాగా, మాంచెస్టర్ దాడితో యూరోప్ దేశాలన్నీ అప్రమత్తం అయ్యాయి. భద్రతను కట్టుదిట్టం చేశాయి. జనం ఎక్కువగా ఉండే చోట తనఖీలను ముమ్మరం చేశాయి. అమెరికా కూడా భద్రతను కట్టుదిట్టం చేసింది. మాంచెస్టర్ ఎరీనా మృతులకు బ్రిటన్ ప్రధాని థెరిస్సా మే ప్రగాఢ సానుభూతిని తెలిపారు.