: ప్రాణం పోయినా పర్వాలేదు కానీ... జుట్టు కత్తిరించడానికి మాత్రం వీల్లేదన్న చైనా యువతి!


యువత స్మార్ట్ ఫోన్ మాయలో పడి ప్రాణాలమీదికి తెచ్చుకుంటోంది. తాజాగా చైనాలో చోటుచేసుకున్న ఘటన గురించి వింటే ఔరా! అని ముక్కున వేలేసుకోకమానరు...ఆ ఘటన వివరాల్లోకి వెళ్తే...చైనాలోని గ్వాంగ్‌ డాంగ్‌ ప్రావిన్స్‌ లో స్మార్ట్ ఫోన్ చూసుకుంటూ మెట్రో ట్రైన్ ఎక్కిన ఓ యువతి ద్వారానికి దగ్గర్లో నిలబడిపోయింది. దీంతో ఆమె జుట్టు ట్రైన్ ద్వారం మధ్యలో ఇరుక్కుపోయింది. దీనిని చూసిన పలువురు తోటి ప్రయాణికులు వెంటనే సబ్‌ వే అధికారులకు సమాచారం అందించారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల రైలు మరో ఆరు స్టేషన్ల తర్వాతే ఆపడానికి వీలవుతుందని, ఈ లోపు ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా ఆమె జుట్టు కత్తిరించేస్తే సరిపోతుందని సలహా ఇచ్చారు. దీంతో ప్రమాదంలో ఉన్న ఆ యువతికి సర్దిచెప్పేందుకు తోటి ప్రయాణికులు ప్రయత్నించగా... ప్రాణం పోయినా ఫర్వాలేదు కానీ... జుట్టు కత్తిరించేందుకు మాత్రం అంగీకరించేది లేదని తేల్చిచెప్పింది. దీంతో అంతా షాక్ కు గురయ్యారు. అయితే ఆమె అదృష్టం బాగుండి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

  • Loading...

More Telugu News