: ఈ పిల్లి ఏకంగా 3.9 అడుగుల పొడవు పెరిగింది... మీరూ చూడండి!
పిల్లులు మామూలుగా ఒకటి లేదా రెండు అడుగుల పొడవు ఉంటాయి. అయితే, ఆస్ట్రేలియాలోని మెల్‌బోర్న్‌లో స్టెఫానీ(29) అనే ఓ మహిళ పెంచుకుంటున్న ఓ పిల్లి మాత్రం ఏకంగా 3.9 అడుగుల పొడవు పెరిగింది. ఇక దీని బరువు 14 కేజీలుగా ఉంది. ఈ అతిపొడవైన పిల్లి పేరు మాగ్గీ ఒమర్. త్వరలోనే ఇది ప్రపంచంలోనే అత్యంత పొడవైన పిల్లిగా రికార్డులకెక్కనుంది. ఈ పిల్లి యజమానురాలు తాజాగా మీడియాతో మాట్లాడుతూ... తాను దాన్ని కొనుగోలు చేసినప్పుడు ఎంతో చిన్నదిగా ఉండేదని, మూడేళ్లలో అది విపరీతంగా బరువు, పొడవు పెరిగిపోయిందని చెప్పింది. దాని గురించి గిన్నిస్‌బుక్ రికార్డ్స్ నిర్వాహకులకు తెలియజేశానని, ఒమర్‌ను రికార్డుల్లోకి ఎక్కించేందుకు వారు సిద్ధంగా ఉన్నారని తెలిపింది.