: 'వాన్న క్రై' కన్నా భయంకరమైన కొత్త మాల్వేర్.. మరింత ముప్పు ఉంటుందంటున్న నిపుణులు
హ్యాకర్లు 'వాన్న క్రై' రాన్సమ్వేర్ వైరస్‌తో దాడిచేసి ప్రపంచాన్ని వణికించిన విషయం తెలిసిందే. ఈ విషయాన్ని మర్చిపోకముందే కొత్తగా ఇటర్నల్ రాక్స్ పేరుతో ఓ వైరస్‌ని కనిపెట్టారు నిపుణులు. ఇది వాన్న క్రై కంటే మరింత ప్రమాదకరంగా మారే అవకాశం కూడా ఉందని పేర్కొంటున్నారు. ఇది ఇటర్నల్ బ్లూ అనే ఎన్ఎస్ఏ టూల్‌ను ఉపయోగించుకుంటుందని, అది సులువుగా ఒక కంప్యూటర్ నుంచి మరోదానికి విండోస్ ద్వారా వ్యాపిస్తుందని ఫార్చూన్ పత్రిక పేర్కొంది.
ఇటర్నల్ రాక్స్.. ఇటర్నల్ చాంపియన్, ఇటర్నల్ రొమాన్స్, డబుల్ పల్సర్ అనే ఎన్ఎస్ఏ టూల్స్‌ను కూడా ఇది ఉపయోగించుకుంటుందని తెలిపింది. అది ఉపయోగించుకొనే ఇటర్నల్ బ్లూ ఒకసారి ఇన్ఫెక్ట్ అయిన కంప్యూటర్ను ఉపయోగించుకుని రిమోట్ కమాండ్ల ద్వారా ఇతర కంప్యూటర్లను కూడా ఏ సమయంలోనైనా నాశనం చేయవచ్చని హెచ్చరించింది. ఇటీవల గడగడలాడించిన వాన్న క్రైని అడ్డుకోవడానికి ఒక కిల్ స్విచ్ ఉంది. అయితే, ఇటర్నల్ రాక్స్‌కి ఆ అవకాశం కూడా లేదని పేర్కొంది.