: ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం మానండి!: బీజేపీకి శత్రుఘ్న సిన్హా హితవు

ప్రముఖ బాలీవుడ్ నటుడు, బీజేపీ సీనియర్ నేత శత్రుఘ్న సిన్హా సొంత పార్టీపై మరోసారి తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బీహార్ కు చెందిన శత్రుఘ్న సిన్హా చేసిన వరుస ట్వీట్లు బీజేపీలో హట్ టాపిక్ గా మారాయి. బీజేపీ నేతలు అనుసరిస్తున్న విధానాలపై ఆయన స్పందిస్తూ... నెగెటివ్‌ రాజకీయాలు చేయడం ఆపాలని సూచించారు. కేజ్రీవాల్‌, లాలూ ప్రసాద్ యాదవ్‌ వంటి ప్రత్యర్థులను అపఖ్యాతి పాల్జేసేందుకు ప్రయత్నించడం మానుకోవాలని ఆయన హితవు పలికారు. నిజాయతీ, పారదర్శకత పట్ల మన పార్టీకి నమ్మకముందని గుర్తు చేసిన ఆయన, ఐకమత్యంగా ఉంటే సరిపోతుందని తెలిపారు. అంతే కాకుండా ప్రత్యర్థులపై నిరాధార ఆరోపణలు చేయడం మానుకోవాలని, మీడియాలో సంచలనాల కోసం పాకులాడవద్దని ఆయన హితవు పలికారు. 

More Telugu News