: ‘మన్ కీ బాత్’ కి విదేశాల్లోనూ విశేష ఆదరణ!
ప్రతి నెలా ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రసంగించే 'మన్ కీ బాత్ కార్యక్రమం' ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్)లో ప్రసారమవుతున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమానికి మన మదేశంలోనే కాకుండా, విదేశాల్లోనూ మంచి ఆదరణ లభిస్తోందట. ఈ విషయాన్ని ఆల్ ఇండియా రేడియో (ఏఐఆర్) ఎక్స్ టర్నల్ సర్వీస్ డివిజన్ డైరెక్టర్ అమలన్ జ్యోతి తెలిపారు. సుమారు 150 దేశాల్లోని భారత సంతతి ప్రజలు ఈ కార్యక్రమాన్ని వింటున్నారని చెప్పారు.
హిందీలో ప్రసారమయ్యే ‘మన్ కీ బాత్’ను ఇంగ్లీషు, రష్యన్, ఫ్రెంచ్, ఉర్దూ, చైనా భాషల్లోకి తర్జుమా చేసి ప్రసారం చేస్తున్నామని చెప్పారు. ముఖ్యంగా, మోదీ ప్రసంగించే సమయంలో ఆఫ్రికా దేశంలో నివసించే గుజరాతీ ఎన్ఆర్ఐల నుంచి అధిక సంఖ్యలో మెస్సేజ్ లు వస్తున్నాయని, గల్ఫ్ దేశాలు, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, కెనడా ప్రాంతాల నుంచి భారత సంతతికి చెందిన శ్రోతలు తమ మెస్సెజ్ లు పంపుతున్నారని చెప్పారు.