: చంద్రబాబు గురించి మాట్లాడుకోవడం వేస్ట్: ‘రసమయి’ బాలకిషన్
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుది పాపిష్టి పాలన అని, అది ప్రజల పాలన కాదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ‘రసమయి’ బాలకిషన్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ, 'చంద్రబాబు ఒక అవకాశవాది, ఆయనకు కావాల్సింది పదవి, అది లేకపోతే ఉండలేర'ని విమర్శించారు. 'ఈ వ్యాఖ్యలు ఎందుకు చేస్తున్నానంటే, ఆయన చరిత్ర అందరికీ తెలుసు, సొంత మామనే పార్టీ నుంచి దించిన చంద్రబాబు గురించి టీవీల్లో మాట్లాడుకోవడం వేస్ట్' అని తీవ్రంగా విమర్శించారు. ‘చంద్రబాబుకు, కేసీఆర్ కు ఏ కోశాన పొంతన ఉండదు, పదవుల కోసం చంద్రబాబు ఏదైనా చేయగలడు. మా సార్ మాత్రం ఉన్న పదవులను గతంలో కూడా వదులుకున్నాడు’ అని బాలకిషన్ అన్నారు.