: సచిన్ నోట హైదరాబాద్ బిర్యానీ మాట!
హైదరాబాద్ లో ఎండలు ఎంత ఎక్కువగా ఉన్నా ఇక్కడి ఫ్యాన్స్ చల్లదనాన్ని ఇస్తారని క్రికెట్ దిగ్గజం సచిన్ అన్నారు. తన బయోపిక్ ‘సచిన్: ఏ బిలియన్ డ్రీమ్స్’ త్వరలో విడుదల కానున్న నేపథ్యంలో ఓ న్యూస్ ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో సచిన్ మాట్లాడుతూ, హైదరాబాద్ బిర్యానీ అంటే తనకు చాలా ఇష్టమని, హైదరాబాద్ లో తనకు చాలా మంచి జ్ఞాపకాలు ఉన్నాయని అన్నారు. తన బయోపిక్ గురించి ప్రస్తావిస్తూ,ఈ చిత్రానికి ఏఆర్ రెహ్మాన్ అందించిన సంగీతం చాలా బాగుందని, రెహ్మాన్ తనకు చిరకాల మిత్రుడని చెప్పుకొచ్చారు.