: ప.గో.జిల్లాలో పోలీసులు, ప్రజాప్రతినిధుల మధ్య ముదురుతున్న వివాదం!


పశ్చిమగోదావరి జిల్లాలో పోలీసులు-ప్రజాప్రతినిధుల మధ్య వివాదం ముదురుతోంది. పన్నెండు మంది ఎమ్మెల్యేలు, ఇద్దరు ఎమ్మెల్సీలు తమ గన్ మెన్లను ఉపసంహరించుకుంటామని అంటున్నారు. తణుకు ఎమ్మెల్యేపై కేసు నమోదుకు నిరసనగా ప్రజాప్రతినిధులు ఈ ప్రకటన చేశారు. కాగా, తణుకు ఎమ్మెల్యే అరమిల్లి రాధాకృష్ణ తన ఇంటికి ఎస్ఐ, రైటర్లను పిలిపించి నిర్బంధించారని ఆరోపిస్తూ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఇరగవరం ఎస్ఐ శ్రీనివాస్ ఈ మేరకు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.
 

  • Loading...

More Telugu News