: హాంగ్ కాంగ్ విమానానికి తప్పిన పెను ముప్పు... జాగ్రత్తగా ల్యాండ్ చేసిన పైలట్
హైదరాబాదులోని శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాంకాంగ్ కు బయల్దేరిన విమానానికి పెనుముప్పు తప్పింది. ఘటన వివరాల్లోకి వెళ్తే... నేటి తెల్లవారు జామున 2:45 నిమిషాలకు కేత్వే ఫసిఫిక్ ఎయిర్ లైన్స్ కు చెందిన విమానం శంషాబాద్ లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి హాంగ్ కాంగ్ కు బయల్దేరింది. విమానం గాల్లోకి లేచిన 35 నిమిషాల తరువాత అది ఓ పక్షిని ఢీ కొట్టింది. వెంటనే పైలెట్ ఎయిర్ కంట్రోల్ కు సమాచారం ఇచ్చి, వెనుదిరిగాడు. ఎయిర్ పోర్టులో జాగ్రత్తగా ల్యాండ్ చేయడంతో అంతా హాయిగా ఊపిరి పీల్చుకున్నారు. ఈ సమయంలో విమానంలో 244 మంది ప్రయాణికులున్నారు. వారందర్నీ నోవాటెల్ హాటల్ కు పంపి... విమానాన్ని పరిశీలిస్తున్నారు. ప్రయాణానికి అనువుగా ఉంటే విమానం మరమ్మతులు పూర్తి చేసి, తరువాత బయల్దేరనుంది.