: ఈ బుడతడు డీజేయింగులో ఘనుడు.. గిన్నిస్ రికార్డు కొట్టాడు!


పిట్టకొంచెం కూత ఘనమనే సామెతకు జపాన్ కు చెందిన ఇట్సుకీ మోరిట సరిగ్గా సరిపోతాడు. ఆరేళ్ల 11 నెలల వయసున్న ఈ బుడతడు తన తోటి పిల్లలంతా బొమ్మలతో ఆడుకుంటుంటే.. తాను మాత్రం పాటలతో ఆటాడుకుంటున్నాడు. జపాన్ లోని ఒసాకాలోని ఎల్ రెస్టారెంట్ లో డీజేగా పనిచేస్తూ భోజనప్రియులను ఆకట్టుకుంటున్నాడు. తొలుత తన తల్లి స్నేహితురాలి దగ్గర డ్రమ్స్ వాయించడం నేర్చుకున్న ఇట్సుకీ తరువాత డీజేయింగ్ వైపు మళ్లాడు. అందులో అద్భుతమైన ప్రతిభ కనబర్చి ‘యంగెస్ట్‌ క్లబ్‌ డిజే’ గా నిలిచాడు. రెస్టారెంట్ లోని పెద్ద సంఖ్యలో యువకులు, చిన్నారులు, గిన్నిస్ రికార్డు ప్రతినిధుల ముందు డీజేయింగ్ లో తన ప్రతిభను ప్రదర్శించడం ద్వారా ప్రపంచ రికార్డు నెలకొల్పాడు. డిస్కో, రాక్‌ మ్యూజిక్‌ లను కలిపి ప్లే చేసే ఇట్సుకీ, తనకు స్వీడన్‌ కు చెందిన ప్రఖ్యాత డిజే ఎవిస్సీ అంటే చాలా ఇష్టమని చెబుతున్నాడు. బుల్లి డీజే ప్రతిభను మీరు చూడా వినండి...

  • Loading...

More Telugu News