: కె.విశ్వనాథ్‌ను 'బాహుబలి'తో పోల్చిన గవర్నర్ నరసింహన్
ఇటీవలే దాదాసాహెబ్ ఫాల్కే అవార్డును అందుకున్న దర్శకుడు, కళాతపస్వి కె.విశ్వనాథ్‌కు ఈ రోజు తెలుగు దర్శక సంఘాల ఆధ్వర్యంలో ఆత్మీయ సన్మానం జరిగింది. హైదరాబాద్‌లోని జేఆర్‌సీ కన్వెన్షన్ హాల్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి దర్శకులు కోడి రామకృష్ణ, రాజమౌళి, కొరటాల శివ, నిర్మాత దిల్ రాజు, నటులు కృష్ణంరాజు, తణికెళ్ల భరణి, తెలుగు సినీ రచయితల సంఘం సభ్యులతో పాటు మరికొందరు సినీ ప్రముఖులు హాజరయ్యారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చిన గవర్నర్ నరసింహన్.. విశ్వనాథ్‌ను సత్కరించి, ఆయన తెలుగు సినిమాకి చేసిన సేవలను కొనియాడారు. సినీ చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోయే చిత్రాలను ఆయన అందించారని అన్నారు. విశ్వనాథ్ ను ఆయన బాహుబలితో పోల్చారు.