: ఏపీలో పలుచోట్ల భారీ వర్షం
గుంటూరు నగరంలో ఈ రోజు మధ్యాహ్నం 46 డిగ్రీలు దాటే ఉష్ణోగ్రతలు నమోదుకాగా, మరోవైపు సాయంత్రం మాత్రం భారీ వర్షం పడింది. ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షం కురవడంతో రహదారులు నీటితో నిండిపోయాయి. భారీ వర్షం ధాటికి పలు చోట్ల చెట్లు నేలకొరిగాయి. మధ్యాహ్నం ఎండలతో బెంబేలెత్తిపోయి బయటకు రావాలంటేనే జంకిన గుంటూరు వాసులు.. సాయంత్రం పూట మళ్లీ భారీ వర్షం కారణంగా బయటకురాకుండా ఉండిపోయారు. మరోవైపు అనంతపురం వెనుకొండ మండలం మావటూరులో పిడుగుపాటుకి ఓ వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. శ్రీకాకుళం హిరమండలం కోడూరులో ఈదురుగాలులు వీచాయి. విజయనగరంలోని పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది.