: అతని వయసు 76.. యువతికి తరుచూ ఫోన్ చేస్తూ 'లాంగ్‌ డ్రైవ్ వెళ‌దాం వ‌స్తావా?' అంటూ వేధింపులు!


చింత చచ్చినా పులుపు చావలేదు.. 76 ఏళ్ల వ‌య‌సులో మ‌న‌వ‌ళ్లు, మ‌న‌వ‌రాళ్ల‌తో ఆడుకుంటూ ఇంటిప‌ట్టున కూర్చొని కృష్ణారామా అనుకునే వ‌య‌సులో ఆ వృద్ధుడు నీచానికి పాల్ప‌డుతున్నాడు. 25 ఏళ్ల వయసున్న ఓ పోకిరీలా ప్ర‌వ‌ర్తించాడు.. ఓ యువ‌తికి ఫోన్ చేస్తూ వేధిస్తున్నాడు.. ఆ వృద్ధుడు ఆ యువ‌తితో అన్న మాట‌లు విన్న వారంతా ఆశ్చ‌పోతున్నారు. లాంగ్‌ డ్రైవ్ వెళ‌దాం వ‌స్తావా? అంటూ వేధించాడు. ఆశ్చర్యానికి గురైన యువతి ఏం చేయాలో తెలియక ఫోన్‌ కట్‌ చేసిన‌ప్ప‌టికీ మ‌ళ్లీ మ‌ళ్లీ ఫోన్ చేస్తూ అసభ్యంగా మాట్లాడుతున్నాడు. చివరకు బాధిత యువ‌తి రాచకొండ షీటీమ్‌ వాట్సాప్‌ నంబర్‌కు సమాచారం అందించడంతో ఆ వృద్ధుడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు ఈ రోజు అత‌డిని మీడియా ముందు ప్ర‌వేశ‌పెట్టారు.

ఈనెల 18న బాధిత ఎంబీఏ విద్యార్థిని అయిన ఓ యువ‌తి కుషాయిగూడ సాయిబాబా దేవాలయానికి త‌న తాత‌లో కలిసి వచ్చింది. ఐతే, ఒక్క‌సారిగా ఆయ‌న‌ అస్వస్థతకు గురయ్యాడు. ఈ సమయంలో వారికి ఓ వృద్ధుడు క‌నిపించాడు. త‌న‌ను వినోద్‌ దేవన్ అని ప‌రిచ‌యం చేసుకొని తన ద్విచక్రవాహనం మీద తీసుకుని వారి ఇంటి వద్ద ఇద్దరినీ దింపాడు. ఆ సమయంలోనే ఆ యువతి ఫోన్‌ నంబరు తీసుకున్నాడు. ఇక వేధించ‌డం మొద‌లుపెట్టి ఈ వ‌య‌సులో ఇలా పోలీసుల‌కు చిక్కాడు.

  • Loading...

More Telugu News