: రేపటి ఫైనల్ మ్యాచ్ లో మేమే గెలుస్తాం: ముంబై ఇండియన్స్ బౌలర్ కరణ్ శర్మ
ఐపీఎల్-10 సీజన్‌లో రేపు తుది పోరు జరగనున్న విషయం తెలిసిందే. ఈ ఫైనల్ మ్యాచ్‌లో తలపడనున్న రైజింగ్ పుణె సూపర్ జెయింట్, ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు ఎవరికి వారు విజయం తమదేనని అంటున్నారు. ఈ క్రమంలో ఈ సీజన్‌లో అద్భుతంగా రాణిస్తోన్న ముంబై ఇండియన్స్ బౌలర్ కరణ్ శర్మ మీడియాతో మాట్లాడుతూ... తాము ఫైనల్ మ్యాచ్ ను గెలవడానికి అన్ని రకాలుగా రెడీగా ఉన్నామని తెలిపాడు. పుణెపై తమ జట్టు ఓటముల రికార్డు అనేది గతమని అన్నాడు. ఫైనల్ మ్యాచ్‌లో తాము విజేతలుగా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశాడు. బౌలింగ్ చేయడమే తనకు తెలిసిన విషయమని, మ్యాచ్ గెలవడానికి తాను పోరాడతానని చెప్పాడు.