: ప్రధాని మోదీకి జగన్ సరెండరయ్యారు: సీఎం చంద్రబాబు
ఏపీ ప్రతిపక్ష నేత జగన్ పై సీఎం చంద్రబాబు నాయుడు మండిపడ్డారు. చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న ఆయన ఈ రోజు రొంపిచర్ల గ్రామంలో జరిగిన బహిరంగ సభలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ, తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకోవడం కోసమే ప్రధాని నరేంద్రమోదీకి జగన్ సరెండర్ అయ్యారని ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయమై తన పార్టీ ఎంపీలతో రాజీనామా చేయిస్తానని జగన్ నాడు చేసిన వ్యాఖ్యలు ఏమయ్యాయని ప్రశ్నించారు. ఏపీ అభివృద్ధి సాధించాలన్న ఉద్దేశంతోనే ప్రత్యేకహోదా విషయమై తాను రాజీపడ్డానని, ప్రత్యేక ప్యాకేజ్ కు అంగీకరించాను తప్పా వేరే ఉద్దేశం తనకు లేదని అన్నారు.