: మూడు కోట్ల సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టిన హోటల్ యజమాని అరెస్టు
భారీ మొత్తంలో సర్వీస్ ట్యాక్స్ ఎగ్గొట్టిన ఓ హోటల్ యజమానిని అరెస్టు చేశారు. విశాఖపట్టణంలోని హోటల్ మేఘాలయ ఎండీ సురేష్ ను సెంట్రల్ ఎక్సైజ్ అండ్ కస్టమ్స్ అధికారులు అరెస్టు చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ, మూడు కోట్ల రూపాయల మేరకు సర్వీస్ ట్యాక్స్ చెల్లించలేదని, అందుకే, అరెస్టు చేశామని చెప్పారు. మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా ఆయనకు 14 రోజుల రిమాండ్ విధించినట్టు చెప్పారు. సురేష్ ను రిమాండ్ కు తరలించినట్టు తెలిపారు.