: మార్కెట్ న్యూస్: స్వల్ప లాభాలలో సెన్సెక్స్


ఈ రోజు స్టాక్ మార్కెట్లు స్వల్ప లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్ 30 పాయింట్లు లాభపడి, 30,464.92 పాయింట్ల వద్ద ముగిసింది. అయితే, నిఫ్టీ మాత్రం 1.55 పాయింట్లు నష్టపోయి 9,427.90 పాయింట్ల వద్ద ముగిసింది. ఎన్ఎస్ఈలో బ్యాంక్ ఆఫ్ బరోడా, ఎస్బీఐ, ఎస్ బ్యాంక్, ఐటీసీ సంస్థల షేర్లు లాభపడగా; ఐసీఐసీఐ, టెక్ మహీంద్రా, బీపీసీఎల్ సంస్థల షేర్లు స్వల్పంగా నష్టపోయాయి. కాగా, జీఎస్టీపై కేంద్రం తీసుకున్న కీలక నిర్ణయాలు, ఎఫ్ఎంసీజీ షేర్ల ధరలు దూసుకుపోవడంతో ఈ రోజు మార్కెట్లపై సానుకూల ప్రభావం చూపాయి. దీంతో, స్టాక్ మార్కెట్లు లాభాలతో ముగిశాయి.

  • Loading...

More Telugu News