: వ్యక్తిగతమైన ఈ దాడులు ఏంటి?: కోదండరామ్
సమస్యలను పరిష్కరించడంలో తెలంగాణ ప్రభుత్వం విఫలమవుతోందని టీజేఏసీ ఛైర్మన్ ప్రొఫెసర్ కోదండరామ్ అన్నారు. సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వారిపై వ్యక్తిగత దాడులకు దిగుతున్నారని ఆయన మండిపడ్డారు. ధర్నా చౌక్ పట్ల స్థానికులకు వ్యతిరేకత ఉందనే విషయాన్ని నిరూపించడంలో ప్రభుత్వం విఫలమైందని ఎద్దేవా చేశారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ధర్నా చౌక్ కు సంబంధించి అఖిలపక్ష సమావేశాన్ని నిర్వహించాలని డిమాండ్ చేశారు. చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని అన్నారు. ధర్నాచౌక్ కు సంబంధించి భవిష్యత్తు కార్యాచరణను పరిరక్షణ కమిటీ త్వరలోనే ప్రకటిస్తుందని చెప్పారు.