: అమ్మాయిని వేధిస్తున్నారంటూ... ఇద్దరు యువకులను నగ్నంగా ఊరేగించిన గ్యాంగ్!
ప్రేమించి పెళ్లి చేసుకున్నారని ఇటీవలే గుజరాత్‌లో ఓ జంటను నగ్నంగా ఊరేగించిన ఘటనను మరవకముందే ఇటువంటి ఘటనే మహారాష్ట్ర, పుణెలోని కర్వే నగర్‌లో చోటుచేసుకుంది. లైంగిక వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపిస్తూ ఇద్దరు యువకులను ఓ గ్యాంగ్ నగ్నంగా ఊరేగించింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నలుగురిని అదుపులోకి తీసుకొని దర్యాప్తు కొనసాగిస్తున్నారు. ఇద్దరు యువకులు ఓ అమ్మాయిని లైంగికంగా వేధిస్తున్నారని ఆరోపిస్తూ చట్టాన్ని చేతిలోకి తీసుకొని, వారిని ఈ గ్యాంగ్ చితకబాదిందని పోలీసులు తెలిపారు. అంతటితో ఆగకుండా నగ్నంగా ఊరేగించిందని చెప్పారు.