: పళనిస్వామిపై విమర్శలు గుప్పించిన పన్నీర్ సెల్వం
తమిళనాడు ముఖ్యమంత్రిగా కొనసాగే అర్హత పళనిస్వామికి లేదని మాజీ ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వం అన్నారు. పళనిస్వామిని ముఖ్యమంత్రిగా శశికళ నియమించిందని... అందువల్ల ఈ పదవికి ఆయన అర్హుడు కాదని తెలిపారు. పార్టీకి సంబంధించిన బాధ్యతలను తాను మాత్రమే నిర్వహించగలనని చెప్పారు. పార్టీకి చెందిన రెండాకుల గుర్తు కోసం ఎన్నికల సంఘానికి అఫిడవిట్ ఇస్తామని తెలిపారు. రాష్ట్రపతి ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల పేర్లు వెల్లడయ్యాక... తాము ఎవరికి మద్దతు ఇవ్వాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ఢిల్లీకి వెళ్లిన ఆయన ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.