: 'వంకాయ ఫ్రై' హీరోయిన్ అనుస్మృతితో ప్రేమలో పడ్డ క్రికెటర్ భువనేశ్వర్ కుమార్!
'వంకాయ ఫ్రై' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు పరిచితమైన హీరోయిన్ అనుస్మృతితో భారత జట్టు క్రికెటర్ భువనేశ్వర్ కుమార్ ప్రేమలో పడ్డట్టు తెలుస్తోంది. ఈ మధ్య కాలంలో ఈ జంట పబ్బుల్లో కనిపించడం, కారులో ఒకరిపక్కన ఒకరు కూర్చుని షికారుకు వెళుతూ కెమెరాలకు చిక్కడంతో, వీరిద్దరూ ప్రస్తుతం డేటింగ్ లో ఉన్నారని, త్వరలోనే వీరి పెళ్లి జరగవచ్చని నెట్టింట పెద్ద చర్చే జరుగుతోంది. ఈ జంట బాగుందని కూడా కామెంట్లు వస్తున్నాయి. తమ ప్రేమాయణంపై అటు భువీ కానీ, ఇటు అనుస్మృతి కానీ ఇంకా పెదవి విప్పలేదు.