: భద్రాచలంలో మావోయిస్టుల కలకలం
తెలంగాణలో మావోయిస్టులు మళ్లీ ఉనికిని చాటుకునే ప్రయత్నం చేస్తున్నారు. భద్రాచలంలో నిన్న రాత్రి మావోయిస్టులు కలకలం రేపారు. మావోల పేరుతో పట్టణంలోని అంబేద్కర్ సెంటర్ లో వాల్ పోస్టర్లు వెలిశాయి. ఇసుక మాఫియాను తరిమికొట్టాలని, ఆపరేషన్ గ్రీన్ హంట్ ను వెంటనే నిలిపివేయాలని పోస్టర్లలో మావోలు డిమాండ్ చేశారు. మరోవైపు, నక్సల్ బరి 50వ వార్షికోత్సవాలను ఈ నెల 23 నుంచి 29 వరకు ప్రతి పల్లెలో నిర్వహించనున్నట్టు జిల్లా కార్యదర్శి ఆజాద్ ప్రకటించారు. ఈ ఉత్సవాలను విజయవంతం చేయాలని కోరారు.