: పథకం ప్రకారమే నాపై దాడి చేశారు: ఎమ్మెల్యే కోమటిరెడ్డి
నల్గొండలో పథకం ప్రకారమే తనపై దాడి చేశారని ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఆరోపించారు. హైదరాబాద్ లో సీఎల్పీ సమావేశం అనంతరం, ఆయన మీడియాతో మాట్లాడుతూ, మంత్రి హరీశ్ రావు ఆహ్వానం మేరకు ఆ రోజున ఆ కార్యక్రమానికి తాను వెళ్లానని చెప్పారు. అయితే, అక్కడికి తనను ఒక్కడినే రమ్మనమని పోలీసులు చెప్పడంతో తనకు ఆశ్చర్యం వేసిిందన్నారు. ఇదంతా చూస్తుంటే, పథకం ప్రకారమే తనపై దాడి జరిగిందనే అనుమానం వస్తోందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ పై ఆయన తీవ్ర వ్యాఖ్యలు చేశారు. నల్గొండలో రౌడీయిజం ఎక్కువగా ఉందని, మాజీ మావోయిస్టులే ఎమ్మెల్యేలుగా ఉన్నారని ఆయన మండిపడ్డారు.