: తెలుగు రాష్ట్రాల్లో వైద్య సీట్ల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు.. పెంచిన ఫీజులకు అనుమతి!

తెలుగు రాష్ట్రాల్లో పీజీ వైద్య సీట్ల పెంపుపై హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. పెరిగిన ఫీజుల ప్రకారం ప్రవేశాలు చేపట్టేందుకు కళాశాలలకు హైకోర్టు అనుమతి ఇచ్చింది. ప్రస్తుతం 50 శాతం ఫీజునే విద్యార్థుల నుంచి తీసుకోవాలని, మిగతా 50 శాతం బ్యాంకు హామీతో వ్యక్తిగత పూచీకత్తు స్వీకరించాలని ఆ ఉత్తర్వుల్లో ఆదేశించింది. ఫీజుల పెంపు అమలును నిలిపివేస్తూ సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను ధర్మాసనం సవరించింది.

More Telugu News