: 'కౌన్ బనేగా కరోడ్ పతి'కి కొత్త రూపు: అమితాబ్ బచ్చన్ స్థానంలో మాధురీ దీక్షిత్ లేదా ఐశ్వర్యరాయ్!


బాలీవుడ్ సూపర్ స్టార్ అమితాబ్ బచ్చన్ వెండితెరపైనే కాకుండా బుల్లితెరపై కూడా సత్తా చాటిన కార్యక్రమం 'కౌన్ బనేగా కరోడ్ పతి'. 1990లో ప్రారంభమైన ఈ కార్యక్రమాన్ని 2014 వరకు అమితాబ్ విజయవంతంగా కొనసాగించారు. ఈ కార్యక్రమం సూపర్ హిట్ కావడంతో... పలు ప్రాంతీయ భాషల్లో కూడా ఇలాంటి ప్రోగాంలు వచ్చాయి. ఆయా భాషల్లోని స్టార్ లు ఈ కార్యక్రమాలకు హోస్ట్ గా వ్యవహరించారు.

ఈ నేపథ్యంలో త్వరలోనే కౌన్ బనేగా కరోడ్ పతి కొత్త సీజన్ ప్రారంభం కానుంది. అయితే, కొన్ని కారణాల వల్ల ఈ సీజన్ లో అమితాబ్ వ్యాఖ్యాతగా వ్యవహరించడం లేదట. ఆయన స్థానంలో మాధురీ దీక్షిత్ లేదా ఐశ్వర్యరాయ్ లలో ఒకరిని తీసుకునే యోచనలో కార్యక్రమ నిర్మాతలు ఉన్నారట. త్వరలోనే ఈ విషయంపై అధికారిక ప్రకటన వెలువడనుందట. 

  • Loading...

More Telugu News