: తెలంగాణకి రానున్న రాహుల్‌గాంధీ.. సంగారెడ్డిలో బహిరంగ సభ!
తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటించనున్నారు. రానున్న సార్వత్రిక ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా ఆయన సంగారెడ్డిలో నిర్వహించనున్న భారీ బహిరంగ సభలో ప్రసంగించనున్నారు. ఈ రోజు గాంధీభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్ రెడ్డి మాట్లాడుతూ... రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా జూన్ 1న రాహుల్ గాంధీ రాష్ట్రానికి రానున్నారని ప్రకటించారు. సంగారెడ్డిలో తెలంగాణ ప్రజాగర్జన పేరుతో ఈ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన ఎన్నికల మేనిఫెస్టోను కూడా ప్రకటిస్తారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటు తరువాత కాంగ్రెస్ నిర్వహిస్తున్న తొలి బహిరంగ సభ ఇదే. ఈ సభ కోసం కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ఏర్పాట్లను మొదలుపెట్టినట్లు తెలుస్తోంది.