: కేసీఆర్ ను కలసిన హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు
కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన జాతీయ అవార్డుల్లో తెలుగు చిత్రాలు శతమానం భవతి, పెళ్లి చూపులకు అవార్డులు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో శతమానం భవతి సినిమా హీరో శర్వానంద్, నిర్మాత దిల్ రాజు, ఇతర యూనిట్ సభ్యులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను ఆయన క్యాంపు కార్యాలయంలో మర్యాద పూర్వకంగా కలుసుకున్నారు.
ఈ సందర్భంగా చిత్ర యూనిట్ ను కేసీఆర్ అభినందించారు. మంచి చిత్రాన్ని నిర్మించారంటూ ప్రశంసించారు. అనంతరం ఈ చిత్రాన్ని నిర్మించిన దిల్ రాజుకు ప్రశంసా పత్రాన్ని, ఓ జ్ఞాపికను అందజేశారు. ఈ విషయాన్ని శర్వానంద్ తన ఫేస్ బుక్ పేజ్ ద్వారా తెలియజేశాడు. జాతీయ అవార్డును గెలుచుకున్నందుకు శతమానం భవతి టీమ్ ను ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అభింనందించారంటూ తెలిపాడు.