: చల్లటి నీరు, మజ్జిగ, రాగిజావ తీసుకోండి.... కాటన్ దుస్తులు ధరించి, నీడపట్టున ఉండండి: వడగాల్పులపై నిపుణుల హెచ్చరికలు
తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. పగలు మాత్రమే కాకుండా, సాయంకాలం కూడా చాలాసేపు వేడిగాలులు వీస్తూ భయపెడుతున్నాయి. ఈ ఎండల వేడిమికి తాళలేక తెలుగు రాష్ట్రాల్లో పలువురు మృత్యువాత పడుతున్నారు. ఈ నేపథ్యంలో మరో నాలుగు రోజుల వరకు ఈ వడగాడ్పుల తీవ్రత ఇలాగే కొనసాగుతుందని హైదరాబాదు వాతావరణ కేంద్రం తెలిపింది. ఈ నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. చల్లటి నీరు అందుబాటులో ఉంచుకోవాలని సూచించింది. అలాగే తరచు చల్లని మజ్జిగ తాగడం మంచిదని తెలిపింది. రాగిజావను అల్పాహారంగా తీసుకోవాలని చెప్పింది. వదులుగా ఉండే కాటన్ దుస్తులు ధరించి, నీడపట్టున ఉండడం ద్వారా వడగాడ్పుల నుంచి కాస్త ఉపశమనం పొందవచ్చని వాతావరణ శాఖ సూచించింది. ఎండల్లోకి వెళ్లకపోవడమే శ్రేయస్కరమని స్పష్టం చేసింది.