: గాయాలతో వచ్చి రైల్వే స్టేషన్ ఎదుట హల్ చల్ చేసిన న్యాయవాది!
ప్రకాశం జిల్లా చీరాల రైల్వే స్టేషన్ ఎదుట ఓ హైకోర్టు న్యాయవాది ఈ రోజు అలజడి రేపారు. తన ఒంటిపై ఉన్న కత్తిపోటు గాయాలతో న్యాయవాది అన్నవరపు అనిల్ కుమార్ అక్కడకు వచ్చి, ఒక దళితుడిపై ఇలా దాడి చేయిస్తారా? అంటూ అందరికీ చెప్పుకున్నారు. తనపై ఈ దాడి గత అర్ధరాత్రి జరిగిందని చెప్పారు. తనకు అన్ని గాయాలయినా ఎవరూ పట్టించుకోలేదని పోలీసులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘటనపై పోలీసులు మీడియాతో మాట్లాడుతూ... అదనపు కట్నం కోసం సదరు న్యాయవాది భార్యను వేధిస్తున్నాడని, తనపై హత్యాయత్నం కూడా చేశారని అనిల్ భార్య పిర్యాదు చేసిందని చెప్పారు. అనిల్ మాట్లాడుతూ.. తనపై పోలీసులే దాడి చేయించారని ఆరోపించారు.