: ములాయం సింగ్ బాహుబలి-2 చూస్తోన్నంత సేపూ ఆయన వెనుకే నిలబడిన కమాండో.. నెటిజన్ల విమర్శలు
సమాజ్ వాదీ పార్టీ నేత ములాయం సింగ్ యాదవ్ లక్నోలోని గోమ్తినగర్‌లో తన సోదరుడు శివపాల్ యాదవ్, ఇతర అనుచరులతో కలిసి ‘బాహుబలి-2’ సినిమా చూసిన విషయం తెలిసిందే. అయితే, ఈ సందర్భంగా తీసిన ఓ ఫొటో ఇప్పుడు ఆన్లైన్లో చక్కర్లు కొడుతోంది. ములాయం సింగ్ మూడు గంటల పాటు కూర్చుని సినిమా చూస్తుంటే ఆయన వెనకే ఓ కమాండో నిలబడి ఉన్నాడు. ములాయం సింగ్ వెనుక మొత్తం ముగ్గురు సెక్యూరిటీ సిబ్బంది నిలబడే ఉండగా వారిలో ఒకరు ఎన్ఎస్జీకి చెందిన బ్లాక్‌క్యాట్ కమాండో ఉన్నారు.
ఎన్ఎస్జీ కమాండోలు భారత్‌కి చెందిన 16 మంది వీవీఐపీలకు భద్రత కల్పిస్తున్నారు. అందులో ములాయంసింగ్ ఒకరుగా ఉన్నారు. కమాండోను మూడు గంటలపాటు నిలబెట్టిన ఆ నేతలపై పలువురు పలు రకాలుగా కామెంట్లు చేస్తున్నారు.
సీనియర్ పాత్రికేయుడు శ్రీనివాసన్ జైన్ తన ట్విట్టర్ ఖాతాలో ఈ ఫొటోను షేర్ చేశారు. సదరు కమాండో మూడు గంటల పాటు అలాగే నిలబడాల్సి వచ్చిందని ఆయన అన్నారు. సెక్యూరిటీ ప్రొటోకాల్‌లో అంత సేపు నిలబడటం సాధ్యం కాదని ఆయన పేర్కొన్నారు.
Mulayam Singh Yadav along with some of the members of Shivpal camp, watched 'Bahubali-2' at a Lucknow multiplex's lounge. #Bahubali2 pic.twitter.com/M8lJ4okEbU
— Uzair Hasan Rizvi (@RizviUzair) May 16, 2017
Note the NSG standing at the back -- prob for the full 3 hrs. https://t.co/BcO7SXnSCR
— Sreenivasan Jain (@SreenivasanJain) May 17, 2017